epaper
Monday, March 2, 2026
epaper

గాదె ఇన్న‌య్య అరెస్ట్

  • జ‌ఫర్‌ఘడ్‌లో మా ఇల్లు అనాథాశ్రమంలో ఆదుపులోకి..
  • ఉపా చ‌ట్టం కింద ఎన్ఐఏ అధికారుల కేసు
  • నివాసం.. అనాథాశ్ర‌మంలో అధికారుల సోదాలు
  • మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు
  • ఇటీవ‌ల హిడ్మా త‌ల్లిని క‌లిసి మాట్లాడిన ఇన్న‌య్య‌
  • మావోయిస్టు వికల్ప్‌ అంత్యక్రియలకు హాజరు
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్య‌తిరేకంగా ప్ర‌సంగం
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైన ఘ‌ట‌న‌

కాకతీయ‌, తెలంగాణ బ్యూరో: మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. జ‌న‌గామ జిల్లా జ‌ఫర్‌ఘడ్‌లోని ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకొని హైద‌రాబాద్ త‌ర‌లించారు. మావోయిస్టులతో సంబంధాలు.. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నార‌నే ఆరోపణలతో ఇన్న‌య్య‌ను అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఇన్నయ్య మాట్లాడారు. ఈనేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశార‌న్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

భావోద్వేగ ప్రసంగం..

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. సుక్మా జిల్లా పువ‌ర్తిలో హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈసమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. అదేవిధంగా ఇటీవల మరణించిన మ‌రో మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఉపా కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img