epaper
Sunday, March 1, 2026
epaper

ఇందిరమ్మ ఇళ్లకు ‘జీ+1’అనుమతులు

ఇందిరమ్మ ఇళ్లకు ‘జీ+1’అనుమతులు
జనగామా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
చిన్న ప్లాట్ లబ్ధిదారుల్లో ఆనందం
కాకతీయ, జనగామ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చిన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద సడలింపు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్లాట్ పరిమితి తక్కువగా ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు జీ+1పద్ధతిలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం వెల్లడించారు. చిన్న ప్లాట్లలో 400 చదరపు అడుగుల నిర్మాణం సాధ్యంకాకపోవడంతో ప్రభుత్వం జీ+1 నిర్మాణానికి అనుమతిచ్చిందన్నారు. కనీసంగా 323 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలని, ప్రతి ఇంటిలో కిచెన్, బాత్‌రూమ్, టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నదని కలెక్టర్ వివరించారు. నిర్మాణ దశలవారీగా ఆర్థిక సహాయం విడుదల అవుతుందని తెలిపారు.

గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రూ.1 లక్ష, మొదటి అంతస్తు కాలమ్స్‌ నిర్మాణం తర్వాత మరో రూ.1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ.2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత రూ.1 లక్ష విడుదల చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు జనగాం జిల్లాలో 5793 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 4950 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. అందులో 2322 ఇళ్లు బెస్మెంట్ దశలో, 833 రూఫ్ లెవల్‌లో, 920 స్లాబ్ లెవల్‌లో, 25 ఇళ్లు పూర్తిగా నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. జనగాం పట్టణానికి 318 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 259 ఇళ్లు గ్రౌండింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇద్దరు లబ్ధిదారులు జనగాంలో, ముగ్గురు స్టేషన్ ఘనపూర్‌లో జీ+1 నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం రూ.77 కోట్లు 28 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. చిన్న ప్లాట్లలో జీ+1 నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది అని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img