ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు..
కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా గంట మహిపాల్ మాట్లాడుతూ జీవీ రామకృష్ణారావు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన పలు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జీవీ రామకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


