epaper
Saturday, March 7, 2026
epaper

కనీస వేతనాలకు పూర్తి రక్షణ

కనీస వేతనాలకు పూర్తి రక్షణ

వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి ఊతం

కాంగ్రెస్ అపోహలు సృష్టిస్తోంది

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : వీబీ–జీ రామ్ జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధికి మరింత బలం చేకూరుతుందని, కనీస వేతనాలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ కుమార్ బోనేటి స్పష్టం చేశారు. ఈ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్‌లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీబీ జీ రామ్ జీ చట్టం–2025 అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చట్టం కీలకంగా నిలుస్తుందన్నారు. కొత్త చట్టం ద్వారా ఎంజీఎన్ఆర్జీఏను బలహీనపరచడం కాదని ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం చెల్లించే నిబంధనలను మరింత పటిష్టం చేశామని వివరించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను గ్రామపంచాయతీలు, గ్రామసభలే రూపొందిస్తాయని పనుల అమలులో స్థానిక సంస్థలకే ప్రధాన బాధ్యత ఉంటుందని తెలిపారు. కనీసం 50 శాతం పనులు గ్రామపంచాయతీల ద్వారానే చేపట్టడం వల్ల స్థానికులకు ఉపాధి లభించి గ్రామాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే ఈ చట్టంపై కాంగ్రెస్ కావాలనే అపోహలు సృష్టిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి తప్పుదారి పట్టించే ప్రచారాలను నమ్మవద్దని అయ‌న తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img