త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
సంక్షేమ ఫలాలు పేదలకు చేరేలా కృషి చేయాలి
డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి
హనుమకొండ కాంగ్రెస్ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్. నాగరాజు, శాసనమండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అయూబ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇవి.వి. శ్రీనివాస్ రావు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి దుదిల్ల శీను బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్‌తో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ… ఎంతోమంది వీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరేలా ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమాజంలో నిరక్షరాస్యత, అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే కాంగ్రెస్ సిద్ధాంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకటరామ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, బీసీ సెల్ అధ్యక్షులు బొమ్మటి విక్రమ్, సేవాదళ్ అధ్యక్షులు బోచ్చు చందర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అజీజ్తో పాటు రాష్ట్ర, జిల్లా, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


