భక్తులకు ఉచితంగా వాటర్ బాటిళ్ల పంపిణీ
వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కాకతీయ, మడికొండ : మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు, జాతర సిబ్బందికి ఈ సౌకర్యం కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం పరిసరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు వచ్చిన భక్తులకు మొత్తం 50 వేల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున్, కాజీపేట మండల అధ్యక్షుడు కందిరాజు, మహాజాతర ఇన్‌చార్జ్ కవిత, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్, వడ్డెర సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.


