142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు..
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూర్, నల్లా వెంకయ్యపల్లి గ్రామాల్లో మంగళవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 142 పశువులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందని, పశువులను వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వ టీకా కార్యక్రమాలను వినియోగించుకోవాలని పశువైద్యాధికారి మాధవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడుదుల నాగలక్ష్మి- ఐలయ్య, పశువైద్య సిబ్బంది డాక్టర్, సందీప్, అమీర్ ఖాన్, అజహర్, సాయి కిరణ్ గోపాలమిత్రలు శ్రీనివాస్, మొండయ్య పాల్గొన్నారు.


