epaper
Thursday, January 15, 2026
epaper

నాలుగోసారి ఫిర్యాదు… ఎట్టకేలకు కదిలిన బల్దియా!

నాలుగోసారి ఫిర్యాదు… ఎట్టకేలకు కదిలిన బల్దియా!
అక్రమ నిర్మాణంపై మళ్లీ ఫిర్యాదు.. గ్రీవెన్స్‌లో వాగ్వాదం
బ‌ల్దియా కమిషనర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
చివరకు నోటీసులకు ఆదేశం

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోతోందన్న ఆరోపణలు మరోసారి బల్దియా గ్రీవెన్స్ వేదికగా వినిపించాయి. రోడ్లు, నాలాలు, చెరువు శిఖం వంటి ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి నాలుగోసారి ఫిర్యాదు చేయడంతో హల్‌చల్ చోటుచేసుకుంది. తన ఫిర్యాదులపై స్పందించకపోవడాన్ని ప్రశ్నిస్తూ అధికారులతో ఫిర్యాదుదారుడికి వాగ్వాదం జరిగింది. అడిషనల్ కమిషనర్ జోక్యంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఈలోగా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వేదికపైకి రావడంతో ఫిర్యాదుదారుడు తన గోడును నేరుగా వినిపించాడు.

ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు

హనుమకొండ హంటర్ రోడ్ ఏరియాలో ఇంటి నంబర్ 1-7-974 పక్కన సుధారాణి అనే మహిళ అక్రమంగా నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికుడు జూలపల్లి సంపత్ రావు ఆరోపించాడు. ఈ మేరకు జూలై 7, జూలై 14, డిసెంబరు 15, 2025 తేదీల్లో మూడు సార్లు గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఒకసారి అవినాశ్ అనే అధికారి ఫోన్ చేసి వివరాలు అడిగినప్పటికీ, ఆ తర్వాత స్పందన లేకపోవడంపై అధికారులను నిలదీశాడు. తాజాగా రోడ్డును ఆక్రమిస్తూ మరో నిర్మాణం కూడా చేపడుతున్నారని పేర్కొన్నాడు.

కమిషనర్ ఆదేశాలతో కదలిక

ఫిర్యాదును విన్న కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వెంటనే సంబంధిత అక్రమ నిర్మాణంపై నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అప్పటివరకు కొనసాగిన వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సంపత్ రావు మొత్తం ఇంగ్లిష్‌లో మాట్లాడటంతో కొంతసేపు గ్రీవెన్స్ సెల్‌లో గందరగోళం నెలకొంది. అధికారులు కూడా మౌనంగా ఉండి ఆయన సమస్యను వినేందుకు ప్రయత్నించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే వారికే అధికారులు భయపడతారా? వారి ఫిర్యాదులకే స్పందిస్తారా? అంటూ ఇతర ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేశారు. తామూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను అదే వారం పరిష్కరించాలని కమిషనర్ తొలి రోజే ఆదేశించినా, జూలై నుంచి మూడుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చర్చ సాగుతోంది. మరి సంపత్ రావు ఫిర్యాదుపై బల్దియా వాస్తవంగా చర్యలు తీసుకుంటుందా? లేక బుట్టదాఖలేనా? అన్నది వేచిచూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img