కాకతీయ, గీసుగొండ: ఊకల్ సొసైటీలోని నలుగురు డైరెక్టర్లపై జిల్లా సహకార అధికారి వేటు వేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల పాలకవర్గాల గడువును పొడిగించగా పాలకవర్గ సభ్యులకు సంఘంలో ఎలాంటి అప్పులు ఉండకూడదని నిబంధన ఉంది.
అయితే మండలంలోని ఊకల్ సొసైటీలోని 12 మంది డైరెక్టర్లలో నలుగురు డైరెక్టర్లలో ఇద్దరి డైరెక్టర్లకు పంట రుణాలు, ఇద్దరి డైరెక్టర్లకు మధ్యకాలిక రుణాలు ఉండగా వారు చెల్లించకపోవడంతో వారి డైరెక్టర్ల పదవిని రద్దు చేస్తూ డిసిఓ ఆదేశాలు జారీ చేశారనీ ఊకల్ సొసైటీ సీఈఓ ఉప్పుల రమేష్ బాబు తెలిపారు.
తొలగించిన డైరెక్టర్లలో ఊకల్ డైరెక్టర్ మండల వీరస్వామి, మనుగొండ డైరెక్టర్ మేకల రాజ్ కుమార్, మొండ్రాయి డైరెక్టర్ చెవ్వ పాపయ్య, విశ్వనాధపురం డైరెక్టర్ భూక్య నిమ్మకు డిసిఓ నోటీసులు ఇచ్చి తొలగించినట్లు సీఈఓ తెలిపారు.


