కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిపాలన కంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత అది సైలెంట్ అయ్యింది. బీఆర్ఎన్ నుంచి 2/3 వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపై అనర్హత వేటు ఉండదు. వారిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసినా..కేసీఆర్ ఎత్తుల ముందు రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ కాలేదు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కోర్టుకెక్కింది.
తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం కొంతకాలంలో కోర్టులో నానుతోంది. తాజాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోకా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. స్పీకర్ వేటు వేయకుండానే తాము ముందుగా రాజీనామా చేయాలని ఆ ఎమ్మెల్యేలు యోచిస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పంచకు చేరిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేసే పరిస్థితి నెలకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అనర్హత వేటుకు ముందు రాజీనామా చేసేందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో మీడియా కోడై కూస్తోంది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ వేటు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే స్పీకర్ వేటు వేయకుండానే తామే ముందుగా రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీళ్లు రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వీళ్లు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది..అనర్హత వేటుకు ముందే రాజీనామాకు సిద్ధమవుతున్నా ఆ నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటూ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రాజీనామా గురించి తమ అనుచరులతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారట.


