కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్
– ఎమ్మెల్యే దొంతి సమక్షంలో చేరిక
కాకతీయ, నర్సంపేట: నర్సంపేట రూరల్ మండల మాజీ జెడ్పిటిసి అజ్మీర పద్మ మేఘ నాయక్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జడ్పీటీసీ తో పాటు మాదన్నపేట మాజీ ఎంపిటిసి ఉడుగుల రాంబాబు, నాగుర్లపల్లె మాజీ సర్పంచ్ గంగడి తిరుపతిరెడ్డి, కొత్తకొండ రాజు, మున్నూరు కాపు పెద్దమనిషి బొల్లోని రజీరు,హర్ష నాయక్ తండ మాజీ ఉపసర్పంచ్ బానోతు సమ్మయ్య, బానోత్ ప్రేమ్ సింగ్,యూత్ నాయకులు వీరబోయిన మహర్షి పుట్ట రాజశేఖర్ ఆకుల శేఖర్, ఆకుతోట కుమార్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు


