బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్
బండి సంజయ్ సమక్షంలో కనుమల్ల విజయ–గణపతి చేరిక
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి కనుమల్ల విజయ–గణపతి బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నందున వివిధ పార్టీల నుంచి నాయకులు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కనుమల్ల విజయ–గణపతి చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుప్పాల రఘు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు దొంతర రమేష్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.


