సిట్ ఎదుట లొంగిపోయిన మాజీ ఎస్ఐబీ ప్రభాకర్‌రావు
కాకతీయ, క్రైం బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (SIB former chief Prabhakar Rao) సిట్ ముందు శుక్రవారం ఉదయం లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపారు. సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్ ముందు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది.


