కాకతీయ, తెలంగాణ బ్యూరో: జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మవారి వేషధారణలో, భక్తి గీతానికి అనుగుణంగా నటిస్తూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతోంది. “రా కదలిరా..” అంటూ వచ్చిన ఈ వీడియోలో ఆమె అమ్మవారి రూపంలో కనిపించడంతో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
ఈ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తుల్లో, ఆభరణాలు ధరించి భక్తి గీతానికి అనుసరించి నటించడమే కాకుండా, భక్తి వాతావరణాన్ని సృష్టించింది. దీంతో చాలా మంది చాలా బాగా చేశారు , అమ్మవారిని జ్ఞాపకం తెచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాజీ సర్పంచ్ అయినా, నవ్య సోషల్ మీడియా వేదికల ద్వారా ఎప్పటికప్పుడు తన సృజనాత్మకతను, భక్తి పట్ల ఉన్న ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో ప్రత్యేకంగా దసరా వేడుకలు, బతుకమ్మ ఉత్సవాల సీజన్ లో రావడంతో మరింత వైరల్ అవుతోంది.


