epaper
Wednesday, March 11, 2026
epaper

గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుర్మరణం

గంగ‌దేవిప‌ల్లి అభివృద్ధి క‌ర్త ఇక‌లేరు
గుండెపోటుతో మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి క‌న్నుమూత‌
మూడు పర్యాయాలు జాతీయ ఆద‌ర్శ గ్రామం సర్పంచ్‌గా బాధ్య‌త‌లు
రెండు పర్యాయాలు ఊకల్ సొసైటీ చైర్మన్‌గా సేవలు
గ్రామాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత

కాకతీయ, గీసుగొండ : జాతీయ ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఉదయం స్వగృహంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి వార్తతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన రాజమౌళి గంగదేవిపల్లిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దారు. మద్యపాన నిషేధం, వంద శాతం అక్షరాస్యత, పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో గ్రామాన్ని జాతీయ ఆదర్శ గ్రామంగా నిలిపిన ఘనత ఆయనదే. ఆయన నాయకత్వంలో గంగదేవిపల్లి పలు మార్లు ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందింది. రాజమౌళి మూడు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. అలాగే రెండు పర్యాయాలు ఊకల్ సహకార సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి రైతుల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన నాయకత్వాన్ని చూసి అనేక మంది ఐఏఎస్ అధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా ప్రశంసించారు. రాజకీయంగా కూడా చురుకుగా ఉన్న ఆయన శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసిపిఐ పార్టీ వ్యవస్థాపకుడు ఓంకార్‌కు సన్నిహిత శిష్యుడిగా గుర్తింపు పొందారు.శాయంపేట నియోజకవర్గంలో ఎంసిపిఐ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన... - డ్రగ్స్ పదార్థాలపై...

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ...

9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌ డీఐజీ కార్యాలయం...

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌ కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ ఆస్పత్రులు, హాస్టళ్లకు...

విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల...

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కాకతీయ, ఖిలా వరంగల్:...

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్...

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img