బీజేపీ గూటికి గువ్వల
కాషాయం కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన గువ్వల గత కొంతకాలంగా బీజేపీలో చేరుతున్నట్లుగా ఊహాగానాలు వినిపించగా.. ఇటీవల ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చెప్పినట్లుగా ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు , రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, లక్ష్మణ్‌తో పాటు రాష్ట్ర స్థాయి నేతలు గువ్వలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఆచారీ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర్లు గారు, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ గారు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ గారు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్ గారు, కట్టా సుధాకర్ గారు,.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీపాచారి గారు, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు గారు, తదితరులు పాల్గొన్నారు.


