నూతన జంటకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ ఆశీర్వాదం
కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గుంపలగూడెం గ్రామానికి చెందిన తిప్పారపు వీరబాబు-రమాదేవి ల కుమార్తె ఐశ్వర్య-అవినాష్ ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదివారం నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట అజ్మీర వీరన్న, మంద రాము,చిప్పలపల్లి శ్రీనివాసరావు, ఎర్రబెల్లి రాము, పాటమ్మ నాగేంద్రబాబు,అందే స్వామి తదితరులు ఉన్నారు.


