కాకతీయ, ఇనుగుర్తి: మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. మోసపూరిత కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటంతో ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. రానున్న ఎలక్షన్లలో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఈ కార్డు చూపించి ఎన్నికల హామీలు ఏమయ్యాయని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


