కాకతీయ, పెద్దపల్లి: ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు పని మానుకొని క్యూ లైన్లో రోజుల తరబడి నిల్చున్న రైతులకు సకాలంలో యూరియా లభించడం లేదని పెద్దపల్లి బీఆర్ఏస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున సుల్తానాబాద్ మండల కేంద్రంలో రైతులకు అవసరమైన యూరియా బీఆర్ఏస్ పార్టీ అధ్వర్యంలో ఇప్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి అయన మాట్లడుతూ.. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పంట పండిస్తేనే ప్రజలు బ్రతుకుతారని, రైతు ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తేనే అందరూ భోజనం తింటారని అటువంటి రైతుకు సకాలంలో అవసరమైన ఎరువులు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోసపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని అయన ఆరోపించారు. ఇది శోచనీయమణి, దారుణమని అయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతును నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులకు అవసరమయ్యే యూరియా కాని ఇతర ఎరువుల బస్తాల వివరాలు కాని ప్రతి సంవత్సరం ఎంత అవసరమో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉంటాయనీ, స్టాటిస్టిక్స్ ఉంటాయని వాటిన అనుసరించి రైతలకు అవసరమైన ఎరువులను ముందే సరఫరా చేసుకోని గోదాములలో నిల్వ ఉంచుకొని సకాలంలో రైతులకు ఇవ్వాల్సి ఉందని కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రైతులు యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఏస్ నాయకులు, రైతులు పాల్గోన్నారు.


