కాకతీయ, పరకాల: అస్సాం గౌహతిలో నీలాచల్ పర్వతంపై కొలువై వున్న కామాఖ్య దేవి అమ్మవారిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తన పుట్టినరోజు శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య వరదాయిని అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.


