కాకతీయ, నడికూడ: మండలంలోని కంటాత్మకూరు గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతిరెడ్డి వెంకట్రాంరెడ్డి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే ముస్త్యాలపెల్లి గ్రామానికి చెందిన బందెల కాంతలక్ష్మి, ధర్మారానికి చెందిన దూలం రమేష్, పరకాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పూజారి సాంబయ్య గౌడ్, అల్లే సారయ్య కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్ రెడ్డి, బండి సారంగపాణి, పాడి భగవాన్ రెడ్డి, కళావతి, దురిశెట్టి చంద్రమౌళి, చందా కుమారస్వామి, వెంకన్న, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
చింతిరెడ్డి వెంకట్రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


