కాకతీయ, గీసుకొండ: వినాయక నిమజ్జనం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని,నాయకులు కార్యకర్తలు సన్నదం కావాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తూ,గీసుగొండలో మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ఇంట్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి తేనీటి విడిదిలో పాల్గొని ముఖ్య కార్యకర్తలతో ముచ్చటించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…యూరియా బస్తాలు అందుతున్నాయా, రుణమాఫీ పూర్తి స్ధాయిలో అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం తర్వాత స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నాయకులు కార్యకర్తలు సిందంగా ఉండాలని పిలుునిచ్చారు. కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోటాను తెప్పించడంలో ఫెయిల్ అయ్యిందన్నాడు.
రెండు లక్షల పైబడిన ఋణ మాఫీ విషయమై అసెంబ్లీలో గళమెత్తుతానని అన్నారు. భూ భారతి చట్టంతో రానున్న ఆరు నెలల్లో అక్రమాలు ఎక్కువ అవుతాయని, ప్రజలు పెట్రోల్ పట్టుకొని తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తారని అన్నారు.ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం అని, కార్యకర్తలు అధైర్య పడుద్దని వారికి ఎప్పటికీ అండదండలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎనమాముల మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం,సంగెం మాజీ గూడ జెడ్పిటిసి సుదర్శన్ రెడ్డి, సంగెం,చల్ల వేణుగోపాల్ రెడ్డి,రఘుపతి రెడ్డి,మాజీ సర్పంచులు బోడకుంట్ల ప్రకాష్, జైపాల్ రెడ్డి, అంకతి నాగేశ్వరరావు, గోలి రాజయ్య,ముంత రాజయ్య, కక్కెర్ల వెంకన్న, యూత్ నాయకులు శిరీష శ్రీకాంత్ కోట ప్రమోద్ మంద రాజేందర్ అజార్ లెనిన్ తదితర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


