రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్ కు తీవ్ర గాయాలు
కాకతీయ,గీసుగొండ: రెండు కార్లు ఢీ కొనగా కారులో ప్రయాణిస్తున్న నర్సంపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుంటి కిషన్ (52) తీవ్రంగా గాయపడ్డాడు.గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ కథనం ప్రకారం, గుంటి కిషన్ తన వ్యాపార పనుల నిమిత్తం తన ఎర్టిగా కారులో హైదరాబాదుకు వెళ్లి తిరిగి వస్తుండగా గురువారం రాత్రి 11.40 గంటల సమయంలో మండలంలోని అపెక్స్ కాలేజ్ సమీపంలో ఎదురుగా వస్తున్న షిఫ్ట్ డిజైర్ కారును దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన గిన్నె శివ అతి వేగంగా,అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ఘటనలో గుంటి కిషన్ కి,అతనితో పాటు ఉన్న అతని బందువు పావునూరి శిరీషకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై గుంటి కిషన్ తమ్ముడు గుంటి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.


