కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రపంచ ప్రసిద్ధ కట్టడమైన రామప్ప దేవాలయంను సిరియా దేశానికి చెందిన పర్యాటకులు రావద్, అమీన్ శనివారం సందర్శించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల శిల్పకళా వైభవాన్ని వీరిద్దరూ ఆసక్తిగా వీక్షించారు. ఆలయ ఆవరణలోని శిల్పాలు, స్తంభాలపై చెక్కిన ప్రతిమలు, రామప్ప చెరువు అందాలు, చరిత్రాత్మక నిర్మాణ శైలిని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత వివరించారు. రామప్ప ఆలయం కేవలం తెలంగాణకే కాదు భారతదేశానికి గర్వకారణమని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని వారు వ్యక్తం చేశారు.


