నాణ్యత పెంచి మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి
మిల్లెట్ స్టాల్‌ను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ
కాకతీయ, గణపురం : నాణ్యత పెంచి మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెల్పూర్ మిల్లెట్ ఆహార పదార్థాల స్టాల్‌ను కలెక్టర్ పరిశీలించారు.స్టాల్ నిర్వాహకులు ఉమాదేవి, లావణ్యలతో ఉత్పత్తుల విక్రయాలు, వినియోగదారుల స్పందన గురించి సమాచారం తీసుకున్నారు. మిల్లెట్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున నాణ్యతను ఇంకా మెరుగుపరచి మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు.స్వచ్ఛమైన ఆహారం, ఆరోగ్యకర జీవన విధానాన్ని లక్ష్యంగా ఉంచుకొని మిల్లెట్ ఉత్పత్తులను మరింత మందికి చేరేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.


