కాకతీయ, నర్సింహులపేట : చెకుముకి సైన్స్ సంబరాలు- 2025 పోస్టర్ ను నర్సింహులపేట మండల విద్యాశాఖ అధికారి రామ్మోహన్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాల్లో ప్రతి ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొనేలా కృషి చేస్తానన్నారు. 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చెకుముకి టాలెంట్ టెస్ట్ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు తాళ్ల మైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూక్యనాగేష్, పీఆర్టియుటీస్ మండల శాఖ అధ్యక్షుడు ఎర్ర పూర్ణచందర్, ప్రధాన కార్యదర్శి కొండ సంజీవ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


