కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీక్రిష్ణాష్టమి వేడుకల వేళ ఉప్పల్, రామంతాపూర్ గోఖలే నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీక్రిష్ణుడి విగ్రహం ఊరెగింపు సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో 6 గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. మరో ముగ్గురికి వేర్వెరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో క్రిష్ణయాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి మరణించారు. వీరంతా 40ఏళ్లు లోపు ఉన్న యువకులే. వీరి డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో స్థానికంగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈఘటన అత్యంత విషాదకరం అన్నారు. బాధితులకు న్యాయం జరగాలన్నారు. గాయపడిన నలుగురికి మెరుగైన చికిత్స అందించాలని విజ్నప్తి చేశారు.


