epaper
Saturday, January 24, 2026
epaper

సిట్టింగ్‌కు ఫిట్టింగ్‌

సిట్టింగ్‌కు ఫిట్టింగ్‌
గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌కు మునిసిప‌ల్‌ ఎన్నిక‌ల‌ స‌వాల్!
భూపాల‌ప‌ల్లిలో వేడెక్కిన రాజ‌కీయం
చైర్మ‌న్ పీఠం ఈసారి బీసీ జ‌న‌ర‌ల్‌కు రిజ‌ర్వ్‌
30 వార్డుల్లో 50 శాతం సీట్లు మ‌హిళ‌ల‌కే
రిజ‌ర్వేష‌న్ల తారుమారుతో ఆశావ‌హుల‌కు ద‌క్క‌ని అవ‌కాశం
భార్య‌ల‌ను పోటీకి దింపేందుకు నేత‌ల‌ ప్ర‌యత్నాలు
అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ త‌ల‌మున‌క‌లు
గెలుపు గుర్రాల వేట‌లో అధికార‌, ప్ర‌తిప‌క్షం
అంగ‌, అర్థ‌బ‌లం ఉన్నోళ్ల‌కే అవ‌కాశం
అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గండ్ర వ‌ర్సెస్ గండ్ర పోరు

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : పురపాలక సంఘాల రిజర్వేషన్లు తేలడంతో ఆశావహుల్లో ఉత్సాహం ఉరక‌లు వేస్తోంది. ఇప్పటికే కొందరు వార్డుల బాటపట్టారు. మ‌రికొంద‌రు ఏ వార్డైతే మేలన్న అంతర్మ‌థ‌నంలో పడ్డారు. ఓటర్లు తమకు అనువుగా ఉన్నారా లేదా అన్న వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియకు ముందు ఫలానా వార్డు రిజర్వేషన్ అనుకూలిస్తే తప్పకుండా పోటీ చేయాలని భావించారు. కానీ రిజర్వేషన్లు మారిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఆయా పార్టీల నేతలు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహం మార్చారు. కొన్నిచోట్ల ప‌తుల స్థానం రాకపోయే సరికి సతులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల నేత‌లు అభ్య‌ర్థుల వేట‌లో ప‌డ్డారు. గెలుపు గుర్రాలపై నేతలు దృష్టి సారించారు. అభ్యర్థులు ఎంపిక విషయంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆయా వార్డుల్లో అభిప్రాయ సేక‌ర‌ణ ప్రారంభించారు.

చైర్మ‌న్ ప‌ద‌వి బీసీ జ‌న‌ర‌ల్‌కు

భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 30 వార్డులకుగాను 50శాతం సీట్లను ఈసారి మహిళలకు కేటాయించారు. మ‌రోప‌క్క రిజ‌ర్వేష‌న్లు అభ్య‌ర్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాయి. అప్పటి వరకు ఎన్నికల బరిలో ఉంటామని భావించిన పలు రాజకీయ పార్టీల నేతలు రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో వారి భార్యలను పోటీకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల నాయకులు వారికి నమ్మకస్తులైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రజల్లో పలుకుబడి, నమ్మకం, ఆర్థికంగా ఉన్నవారిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భావిస్తున్నాయి. గడిచిన రెండు పర్యాయాలు భూపాలపల్లి పురపాలక సంఘం చైర్‌ప‌ర్సన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకే దక్కింది. ఈసారి బీసీ జనరల్‌కు కేటాయించడంతో ప్ర‌ధాన పార్టీల నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోటీలో దించడానికి అంగ‌, ఆర్థిక బలం గల బీసీ జనరల్ అభ్యర్థి కోసం ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ద‌శాబ్దం తర్వాత అవకాశం దక్కడంతో బీసీ సామాజిక వర్గం నేతలు చైర్మన్ పీఠంపై కన్నేసి తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

గండ్ర వ‌ర్సెస్ గండ్ర‌

భూపాల‌ప‌ల్లి మున్సిపాలిటీపై ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాల‌ని ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ ప్ర‌ణాళికలు ర‌చిస్తుండ‌గా.. మ‌రోమారు మున్పిపాలిటీని కైవ‌సం చేసుకొని అధికార పార్టీకి షాక్ ఇవ్వాల‌ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు నేత‌లు వేర్వేరుగా రెండు ప్రధాన పార్టీల ముఖ్య నాయకుల‌తో సమావేశాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల గురించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత పురపాలక సంఘంలోని 30 వార్డులకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించి ఆయా వార్డుల్లో ఆదరణ ఉన్న అభ్యర్థులను గుర్తించాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకులు కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతుండడంతో మున్సిపల్ ఎన్నికల కోలాహలం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తోంది.

స‌త్య‌నారాయ‌ణ‌కు స‌వాల్‌

భూపాల‌ప‌ల్లి పుర‌పాలక సంఘం ఎన్నిక‌లు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌వ‌డం.. ప‌ట్ట‌ణ ఓట‌ర్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం స‌త్తెన్న‌కు స‌వాల్‌గా మారింది. ఎలాగైనా ఈసారి మున్సిప‌ల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాల‌ని ఎమ్మెల్యే గండ్ర గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ముందుకుసాగుతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార భావిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, సన్న బియ్యం, రైతు భరోసా వంటి పథకాలతోపాటు పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ధిలో వేగం దేశమంతా తెలంగాణ...

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ! రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ రూ.23...

విద్యుత్ షాక్‌తో గేదె మృతి

విద్యుత్ షాక్‌తో గేదె మృతి రూ.ల‌క్ష న‌ష్ట‌పోయామ‌ని బాధితురాలి ఆవేద‌న‌ కాకతీయ, ఏటూరునాగారం :...

పారిశుద్ధ్యమే జాతరలో కీలకం

పారిశుద్ధ్యమే జాతరలో కీలకం 285 బ్లాకులుగా జాతర ప్రాంతం విభజన 5,700 టాయిలెట్లు… 5,000...

ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం

ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రంలోని తెలంగాణ...

అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం

అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి...

మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర!

మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర! పైపై పనులతో ల‌క్ష‌ల రూపాయ‌ల‌ దోపిడీ రూ.9 లక్షల...

తొర్రూరు మున్సిపల్‌ పోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

తొర్రూరు మున్సిపల్‌ పోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి కాంగ్రెస్‌ నాయ‌కుల‌కు మంత్రి వాకిటి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img