epaper
Friday, November 21, 2025
epaper

ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల

ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కుల వృత్తుల ప్రోత్సహానికి కట్టుబడి ఉన్నాం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కాకతీయ, కరీంనగర్ : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల వృత్తుల పురోభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో లోయర్ మానేరు డ్యామ్‌లో ఉచితంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై చేప పిల్లలను జలాశయంలో విడిచారు.తరువాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం రూ.2 కోట్లు 18 లక్షల వ్యయంతో 2 కోట్లు 20 లక్షల చేప పిల్లలను చెరువులు, కుంటలు,జలాశయాల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. 80–100 ఎంఎం సైజులో ఉన్న ఈ చేప పిల్లల వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, 1,300 మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతారని వివరించారు.ఎల్‌ఎండీ జలాశయంలో 30 లక్షల చేప పిల్లలను విడిచినట్టు పేర్కొన్నారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న మత్స్యకారుల బకాయిలను విడుదల చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మత్స్యకారుల సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అంతకుముందు ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు. జిల్లాలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన మహిళా మత్స్యకార్మిక సహకార సంఘానికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. కొత్తగా సభ్యత్వం పొందిన వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక సంఘం చైర్మన్ పిట్టల రవీందర్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి, మత్స్య కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇందుర్తి విద్యార్థుల కీర్తి జిల్లా స్థాయికి ఎంపిక

ఇందుర్తి విద్యార్థుల కీర్తి జిల్లా స్థాయికి ఎంపిక కాకతీయ, కరీంనగర్ : శుక్రవారం...

హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి

హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హుజురాబాద్...

టెన్త్‌ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్‌

టెన్త్‌ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్‌ నిర్దోషి గా తేల్చిన...

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్ హుజూరాబాద్ ప్రజలే నా...

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ...

భీమేశ్వరాల‌యంలో ప్రభుత్వ విప్ సందర్శనం

భీమేశ్వరాల‌యంలో ప్రభుత్వ విప్ సందర్శనం కాకతీయ, వేములవాడ : వేములవాడలోని శ్రీ పార్వతి...

బోధ‌న‌ల్లో సృజ‌నాత్మ‌క‌త ఉండాలి

బోధ‌న‌ల్లో సృజ‌నాత్మ‌క‌త ఉండాలి అల్ఫోర్స్ విద్యా సంస్థ‌ల అధినేత వి. నరేందర్ రెడ్డి అల్ఫోర్స్...

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img