ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్
కాకతీయ, కరీంనగర్ : నేషనల్ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అమలును పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బస్సులో కాటన్, రోలర్ బాండేజ్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, పావిడిన్ అయోడిన్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, పారాసిటమోల్ ట్యాబ్లెట్లు, అడ్హెసివ్ పేపర్ ప్లాస్టర్, సర్జికల్ గ్లౌజులు వంటి ప్రాథమిక వైద్య సామగ్రిని తప్పనిసరిగా ఉంచాలని అధికారులు ఆర్టీసీ అధికారులు కు సూచించారు.
అత్యవసర పరిస్థితులలో ప్రయాణికులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కూడా సూచనలిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో పాటు, పి.ఓ.ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా గారు, ఇతర ఆర్టీసీ అధికారులు కూడా పాల్గొన్నారు.


