కాకతీయ, బయ్యారం : మండలంలోని ఇరుసులాపురం గ్రామానికి చెందిన కలికినేని సంపత్ గతనెల రైలు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, రైజింగ్ సన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చెరుకు పల్లి నరేందర్ ఆధ్వర్యంలో బాధితుడిని పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఆ పార్టీ మండల నాయకులు ఏనుగుల ఐలయ్య తల్లి ఏనుగుల బతుకమ్మ బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని సదరు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బయ్యారం మండల అధ్యక్షుడు నీలారపు సతీష్ ఉపాధ్యక్షులు సందీప్, అనిల్, నాగరాజ్ సాయి, సంపత్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


