క్రీడాకారిణికి ఆర్థిక సహాయం
కాకతీయ,నర్సింహులపేట: తెలంగాణ అండర్ -19 తైక్వాండో 40 కేజీల విభాగంలో జాతీయ జట్టుకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన కొత్త ఎల్లయ్య,సమత దంపతుల కుమార్తె లావణ్య ఎంపికయింది.వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే నేషనల్ గేమ్స్ లో ఆమె పాల్గొననుంది.ఈసందర్భంగా స్థానిక డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ సూచన మేరకు గ్రామకాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా మధు ఆమెకు ఆర్థిక సాయం అందజేసారు.లావణ్య ఎంపిక పట్ల ఆమెకు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


