బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలంలోని పోచారం గ్రామ శివారు భద్రు తండాకు చెందిన దారవత్ సోమాని ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
అర్హత కలిగి ఉన్నట్లయితే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాధిత కుటుంబానికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఆయన వెంట ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోత్ సీతారాం,మాజీ వార్డు సభ్యులు కూకట్ల ఎల్లయ్య,రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చట్టు యాకన్న,భారాజు యాదగిరి,రవి,బద్రు, తదితరులు ఉన్నారు.


