కాకతీయ, గీసుగొండ : నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. మండలంలోని దశ్రు తండాకు చెందిన గిరిజన విద్యార్థిని కేలోతు స్రవంతి (తండ్రి రవి) ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్రవంతికి బాలకిషోర్ రెడ్డి ముందుకు వచ్చి రూ.50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు బాలకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజు కుమార్, రడం భరత్ కుమార్, కేలోతు స్వామి చౌహన్, బాధవత్ ఛంద్రభాను తదితరులు పాల్గొన్నారు.


