కాకతీయ, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ సెరికల్చర్ విభాగంలో అధ్యాపకుడిగా కొంతకాలంగా పనిచేసిన డాక్టర్ మెడదుల తిరుపతి యాదవ్ ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆయన మిత్రులు దేశాయిపేటలో తిరుపతి కుటుంబానికి రూ.60వేలు ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని మిత్రులందరూ హామీ ఇచ్చారు. తిరుపతికి భార్య రమాదేవి, కుమారుడు ఫణింద్ర, కుమార్తె సాహితీ ఉన్నారు. కార్యక్రమంలో డాక్టర్ త్రికోవెల బిక్షపతి, డాక్టర్ మిడతపెల్లి రాంబాబు, డాక్టర్ గూటం రాజిరెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ రాము, డాక్టర్ విమల, డాక్టర్ వింధ్య రాణి, డాక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, స్వామి, శ్రీను, సురేష్, జీవన్, డాక్టర్ ఇమ్మడి రాజు, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నేరేటి రాజు, డి.రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


