మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన విజ్జిగిరి విజేందర్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్రంగా విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన చిన్ననాటి స్నేహితులు ముందుకొచ్చారు. అకాల మరణంతో కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్న స్నేహితులు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక ఓదార్పుగా రూ.15,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసిరెడ్డి మల్లారెడ్డి, విజ్జిగిరి దేవేందర్, ఎడ్ల కుమార్, పచ్చిమాట్ల శ్రీకాంత్, బాలసాని రవి, చీర్లంచ కుమార్, నాగండ్ల మహేందర్, గంటే రాజు, నాగండ్ల తిరుపతి, గౌరవేని కొమురయ్య, పొలవెన సంపత్, కవ్వ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


