విద్యార్థులకు క్షేత్ర పర్యటన
కాకతీయ, నర్సింహులపేట : మండలంలోని పడమటిగూడెం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం క్షేత్ర పర్యటన నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఎర్ర పూర్ణచందర్ ఆధ్వర్యంలో ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. పాఠశాలలో పేరెంట్స్–టీచర్స్ సమావేశం అనంతరం ఉపాధ్యాయ బృందం విద్యార్థులను పర్యటనకు తీసుకెళ్లి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. క్షేత్ర పర్యటనల ద్వారా పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని, సృజనాత్మకత పెరుగుతుందని, పర్యావరణంపై అవగాహన కలుగుతుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసు, మురళీధర్, శేఖర్, తిరుపతయ్య, వెంకన్న, సీఆర్పీలు జక్కిరవి, శేషుకుమార్, నరహరి, వీరన్న, నాగేశ్వర్‌రావు, పాఠశాల సిబ్బంది రెహనా, సఫియాబేగం తదితరులు పాల్గొన్నారు.


