- బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
- మినీ సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో చెత్త తరలింపు పరిశీలన
కాకతీయ, వరంగల్ : ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ (కంచెలు) ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగరపరిధిలోని గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి శానిటేషన్ తో పాటు టౌన్ ప్లానింగ్ కు చెందిన అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ సానిటేషన్ ఇన్స్పెక్షన్లతో పాటు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన ఓపెన్ స్పేస్ ల గుర్తింపు కీర్తినగర్ ప్రాంతంలో మినీ సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ (నవీకరించిన క్యాంపాక్టర్ కు స్వచ్ఛ ఆటో నుండి నేరుగా చెత్తను డంప్ చేసుకొని వెళ్ళడం)ను పరిశీలించి మాట్లాడుతూ చెత్త నేరుగా సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించకుండా ఇంధనాన్ని సమయాన్ని ఆదా చేయడానికి మినీ సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన ఓపెన్ స్పేస్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి చెందిన ఓపెన్ స్పేస్ లను గుర్తించాలని అవి ఆక్రమణలకు గురికాకుండా వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ ఓపెన్ స్పేస్ లో బయో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముఖ్య ఆరోగ్యాధికారికి సూచించారు. గొర్రెకుంట ప్రాంతంలో పర్యటించిన క్రమంలో ఆక్రమణలను గమనించిన కమిషనర్ వాటిని తొలగించాలని ఇదే ప్రాంతంలో మరో చోట రోడ్డును ఆక్రమించడాన్ని పరిశీలించి ఆ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కీర్తినగర్ లో 4 ఓపెన్ స్పైసెస్ లలో ఇప్పటికే 2 ప్రాంతాల్లో ఫెన్సింగ్ చేసినందున మిగతా ప్రాంతాలకు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డా.రాజేష్, ఈఈ సంతోష్ బాబు, ఏసిపి శ్రీనివాస్ రెడ్డి, డిఈ సతీష్, టిపిఎస్ శ్రీకాంత్, టిపిబిఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.


