epaper
Monday, March 2, 2026
epaper

ఫీజు రియంబర్స్మెంట్‌పై రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: హరీశ్ రావు ఫైర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పట్టించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి ప్రభుత్వం టెండర్ల కోసం మాత్రమే కృషి చేస్తోందని ఆయన ఆరోపించారు. గత రెండేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా పడే దుస్థితి నెలకొన్నా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

అసెంబ్లీలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తామని, ప్రతి ఏడాదికి సంబంధించి ఆ ఏడాదిలోనే క్లియర్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ నేడు ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమైపోయాయని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లకు బకాయిలు తీర్చడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటూ, కమిషన్లు దండుకోవడంలో ఆసక్తి చూపుతూనే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెద్దఎత్తున టెండర్లకు నిధులు కేటాయించగల ప్రభుత్వం, విద్యా రంగానికి మాత్రం గ్రీన్ చానెల్ హామీలు మరిచిపోయిందని హరీశ్ రావు విమర్శించారు.

బకాయిల కారణంగా అనేక విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు తెలిపారు. విద్యుత్, నీటి బిల్లులు చెల్లించలేక కాలేజీలు మూతపడటం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్న వాస్తవాలను ఆయన వివరించారు. బీఆర్ఎస్ హయాంలో డీమానిటైజేషన్, కరోనా వంటి ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేయలేదని, తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 20 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామని హరీశ్ రావు గుర్తు చేశారు.

ఒకవైపు గురుకులాలను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు ఉన్నత విద్యాసంస్థలను కూల్చివేస్తున్నారు. విద్యా వ్యవస్థను ఈ స్థాయిలో దెబ్బతీసిన ముఖ్యమంత్రి చరిత్రలో చెడ్డపేరు తెచ్చుకుంటారు అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే విద్యా రంగ సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img