హంటర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
9 నెలల గర్భిణీ డాక్టర్ మమత మృతి
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ హంటర్ రోడ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్‌ను లారీ బలంగా ఢీకొట్టింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మమత (33) అక్కడికక్కడే మృతి చెందారు. మమత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, కొలంబియా యూనివర్సిటీలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి ఆమె కుమార్తె అయినట్లు సమాచారం. ఘటనతో హంటర్ రోడ్ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


