- స్కూటీని ఢీకొట్టిన కారు
- భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలావరంగల్ మండలం మామునూర్ గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్నరాజు తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య హారిక (36) అక్కడిక్కడే మృతిచెందింది. అంబూలెన్స్ లో క్షతగాత్రుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.


