కరీంనగర్ వంతెనపై ఘోర ప్రమాదం…
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని వంతెనపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా దూసుకొస్తున్న లారీ, ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం.స్థానికుల వివరాల ప్రకారం… ఢీకొన్న వెంటనే లారీ బాధితుడిని సుమారు 30 మీటర్ల దూరం వరకు లాగుతూ వెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఘటనాస్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
మృతుడు కోహెడ మండలానికి చెందిన ఇస్లావత్ కిషన్‌గా, జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంతో వంతెనపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది




