epaper
Monday, March 2, 2026
epaper

రైతులు కార్పొరేట్ల మాటలు నమ్మొద్దు..!!

కాకతీయ, బయ్యారం: వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతులను పాటిస్తూ, భూసారాన్ని కాపాడుతూ, భూమి పరీక్షల ఆధారంగా పంటలు వేయాలని, కార్పొరేట్ సంస్థల మాటల విని రైతులు మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా కేసముధ్రం మండలం ఈదులపూసపెల్లి గ్రామంలో నూకల రఘునాథరెడ్డి, అభినవరెడ్డి ఫౌండేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అరబిందో ఫార్మా ఫౌండేషన్, జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యానవన పరిశోధన కేంద్రం (జే వి ఆర్ హెచ్ ఆర్ సి) ఆధ్వర్యంలో నేచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ బి.ఆర్.సి సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రైతు కమిషన్ నాయకులు భూ భారతి సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవాని రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సోలేటి అభిమాన రెడ్డి ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించి జయపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంను పరిశీలించారు. అనంతరం నేచురల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో రైతులు రసాయనిక ఎరువులు, ఫెర్టిలైజర్స్,ఫెర్టిసైడ్స్ మోతాదుకు మించి వాడుతూ భూసారాన్ని నిస్సత్తువగా చేస్తున్నారని అన్నారు. దీనితో రాబోవు రోజులలో ఏ పంటలు పండవని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మన పూర్వీకులు రైతులు సేంద్రియ వ్యవసాయం చేసి భూమి సారాన్ని కాపాడుతూ నాణ్యమైన పంటలు పండించారన్నారు.

పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు విత్తన సంస్థల, పురుగుమందుల పేరిట రైతులకు నకిలీ విత్తనాలను, జన్యు మార్పిడి విత్తనాలను, రైతులకు అంటగడుతూ కోట్లు గడిస్తూ, రైతులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ములుగు జిల్లాలు కొన్ని విత్తన కంపెనీలు మొక్కజొన్నలను విత్తనాలను ఇచ్చి మోసగించాయని, వారు వేసిన మొక్కజొన్న కంకి పంట తినడం వల్ల పశువులు, రైతులు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్ల భూసారం కోల్పోయి మనిషి జీవన విధానంలో, వాతావరణంలో పెను మార్పులు సంభవించడం చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు సేంద్రియ వ్యవసాయం చేసి లాభాలు ఘటించాలని సూచించారు.

రైతులకు అనేక హక్కులు ఉన్నాయని, విత్తన చట్టం ఇతర చట్టాలపై అవగాహన లేకపోవడం వలన రైతుల నష్టపోతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.20 వేల కోట్లు రుణమాఫీ, రైతు భరోసా కోసం 15 రోజుల్లో రూ.9వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.

కేంద్రప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం కోసం దేశంలో రైతులను ప్రోత్సహించడానికి రెండువేల కోట్లు ఇవ్వడం ఏమాత్రం సరిపోదని, దానిని లక్ష కోట్ల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రైతు కమిషన్ సభ్యులకు పకృతి వ్యవసాయ ప్రేమికుడు జైపాల్ రెడ్డి మెమోంటో, జ్ఞాపికలను బహుకరించారు.

రాష్ట్రంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఉండే ఆదర్శ రైతుల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ఆదర్శ రైతుల సంఘం ఉపాధ్యక్షుడు గుండ్రాతి భాస్కర్ రెడ్డి, మహబూబాబాద్ డివిజన్ ఆదర్శ రైతులు అజ్మీరా వెంకన్న, ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతు కమిషన్ నాయకులను కలిసి వేడుకున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఎఫ్ పి ఓ ఫౌండేషన్ అడ్వైజర్ నంద్యాల నరసింహారెడ్డి, పి జె టి ఏ యు హరీష్ ఖాన్, ప్రకృతి సేద్య నిపుణుడు కుడుముల వెంకటరెడ్డి, జేవీఆర్ హెచ్ఆర్సీ రాష్ట్ర శాస్త్రవేత్త నాగరాజు, మహేష్, భారతీయ కిసాన్ మోర్చా నాయకులు గోపాల్, మహబూబాబాద్ డివిజనల్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్ నాయక్, కేసముద్రం ఏవో, ఏఈఓలు, సేంద్రీయ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img