- కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల అండాలు శ్రీరామ్
కాకతీయ, పెద్దవంగర : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల అండాలు శ్రీరామ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ నాయక్, పూర్ణ చందర్, మదన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ అధికారి స్వామి నాయక్, ఆర్ఐ లాస్కర్ నాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు భద్రమ్మ, ఇంచార్జి మణెమ్మ, సీసీలు, అకౌంటెంట్ అనిల్, వీవోఏలు, రైతులు పాల్గొన్నారు.


