- జడ్పీ సీఈవో రాంరెడ్డి
కాకతీయ, రాయపర్తి : రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని వరంగల్ జడ్పీ సీఈవో, ఇంచార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, కొలనుపల్లి, కొండూరు, మైలారం గ్రామాలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడారు. ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని తప్పకుండ తుర్పార పట్టించి సకాలంలో కాంటాలు నిర్వహించాలని ఐకేపీ సిబ్బందికి సూచించారు.
శివరాంపురం గ్రామ పరిధిలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ మిల్లులో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య పత్తి కొనుగోలును ప్రారభించారు. కార్యక్రమంలో డీసీఎస్ఓ డి.కిష్టయ్య, డీఎం సివిల్ సప్లయీస్ బీ.సంధ్యారాణి, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో జి.కిషన్, డీపీఎం దాసు, ఏపీఎం రవీందర్, ఏవో వీరభద్రం, ఏఈఓ సాయి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ అద్యక్షుడు హామ్యా నాయక్, మాజీ టీపీసీసీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, వర్ధన్నపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, మహమ్ముద్, మచ్చ రమేష్, పాల్వంచ కోటేశ్వర్, వనజారాణి, చెవ్వు కాశీనాథం తదితరులు పాల్గొన్నారు.


