- దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి
- త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, రాయపర్తి/పర్వతగిరి: భారీ వర్షాలతో పంట నష్టం వాటిల్లిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో శనివారం ఎర్రబెల్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితేల సతీష్ తో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డికి రైతుల బాధ ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నీటి పాలైన రైతు కష్టానికి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారం అందించాలని కోరారు. దెబ్బతిన్న పంటలపై సర్వే నిర్వహించాలన్నారు. రాయపర్తి మండలంలోని ఏకే తండా బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు హలావత్ రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతడి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.


