- మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు
కాకతీయ, పెద్దవంగర : మెంథా తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి కోతలపై, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కావలసిన సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కోతకు వచ్చిన వరి పైరును మాత్రమే కోయాలని సూచించారు. తేమ శాతం 17 కు మించకుండా ఆరబెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. మెంథా తుఫాన్ ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించి ధాన్యం క్రయ, విక్రయాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు మహేందర్, మండల వ్యవసాయ అధికారి గూగులోతు స్వామి నాయక్, ఏఈవోలు రాజు, యశస్విని, విశ్వశాంతి, ఆర్ఐ లష్కర్, ఏఎస్సై హిదాయిత్ అలీ, సహకార సంఘం సీఈవో, ఐకేపి సీసీలు, రైతులు పాల్గొన్నారు.


