కాకతీయ, నెల్లికుదురు: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి యూరియా కోసం రైతులు బుధవారం పోటెత్తారు. పంటలకు నత్రజని అందించే సీజన్ కావడంతో ఒకేసారి వివిధ గ్రామాల నుంచి నెల్లికుదురు పిఎసిఎస్ కు తరలిరావడంతో చాలా సమయం పాటు బారులు తీరారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సమయాన్ని వెచ్చించి యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి ఉండడం భరించలేకపోతున్నామని వెంటనే ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఓ పక్క వ్యవసాయాధికారులు యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నారని, ఇక్కడేమో యూరియా కొరతతో రైతులు గంటల తరబడి వేచి ఉంటున్నామన్నారు.
కాగా పిఎసిఎస్ సేల్స్ మెన్ పూర్ణచందర్ మాట్లాడుతూ.. 30 టన్నుల యూరియా వచ్చిందని తెలవడంతో రైతులు ఒకేసారి రావడం వల్ల రద్దీ ఏర్పడిందన్నారు. రోజుకు ఒక 20 టన్నుల చొప్పున యూరియా సరఫరా చేస్తే ఇబ్బంది ఉండదని తెలిపారు.


