ఏనుమాముల మార్కెట్లో రైతులకు సన్మానం
కాకతీయ, వరంగల్ : జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్లో రైతులను సన్మానించారు. దేశానికే వెన్నెముక లాంటి వారిని గౌరవించుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రైతులు లేనిదే సమాజం మనుగడ ప్రశ్నార్థకం అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం, గ్రేడ్-2 కార్యదర్శి ఎస్.రాము, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి, కాటన్ సెక్షన్ అధ్యక్షులు చింతలపల్లి వీరరావు, చిల్లీ సెక్షన్ అధ్యక్షులు రాజేష్ డీ. కరాని, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


