epaper
Tuesday, March 10, 2026
epaper

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు
గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం వచ్చిన రైతుకు నిరాకరణ
సొసైటీ అప్పు క్లియర్ చేస్తేనే రుణం అంటున్న బ్యాంకు
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న రైతు
డీసీసీబీ మేనేజర్ వైఖరిపై రైతుల ఆగ్రహం
అకౌంట్ వేరు అయినా బలవంతంగా 10000 చెల్లింపు
వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలంటూ డిమాండ్

కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలో డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ లోన్ తీసుకున్న ఓ పేద రైతును సొసైటీ అప్పు పేరుతో వేధిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. కూసుమంచి మండలం లోక్యాతండా గ్రామానికి చెందిన వడిత్య మల్సూర్ అనే రైతు గత సంవత్సరం మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల వ్యవసాయ పనులకు పెట్టుబడి అవసరం కావడంతో గోల్డ్ లోన్ రెన్యువల్ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంకు మేనేజర్ సొసైటీలో నీకు అప్పు ఉందని, ముందుగా ఆ అప్పు క్లియర్ చేస్తేనే గోల్డ్ లోన్ రెన్యువల్ చేస్తామని చెప్పినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. సొసైటీ అప్పు వేరు, బ్యాంకు రుణం వేరు అయినప్పటికీ రెండింటిని కలిపి కొత్త షరతులు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. సొసైటీ లోన్ మొత్తం విషయంలో కూడా సందేహాస్పద పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సొసైటీకి సంబంధించిన బకాయిల్లో భాగంగా 10000 రూపాయలను డీసీసీబీ బ్యాంకు ఖాతాలో చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారని రైతు తెలిపాడు. అంతేకాకుండా మిగిలిన అప్పు చెల్లిస్తామని ఒక లేఖ కూడా రాయించుకున్నారని సమాచారం. ఇంత జరిగినప్పటికీ రైతుకు గోల్డ్ లోన్ రెన్యువల్ చేయకుండా బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు అవసరమైన సమయంలో ఇలా ఇబ్బందులు పెట్టడం వల్ల రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ పనులు, కుటుంబ అవసరాల కోసం రైతులు తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారని, అలాంటి సమయంలో బ్యాంకు అధికారులు సహకరించాల్సిన బదులు అడ్డంకులు సృష్టించడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వైఖరిపై విచారణ జరిపి రైతుకు న్యాయం చేయాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు సహాయం చేయాల్సిన బ్యాంకు అధికారులు ఇబ్బందులు కల్పించడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ చందుర్తి మండలం మర్రిగడ్డ...

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..!

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..! శుభ్రత పనులు చేపట్టిన కార్పొరేటర్లు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం...

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు కాకతీయ, కారేపల్లి: మండలంలో ప్రజా పాలన తొంభై తొమ్మిది...

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img